: వరల్డ్ కప్ నేపథ్యంలో... శశి థరూర్ వెబ్ సైట్ పై హ్యాకర్ల దాడి


కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. బంగ్లాదేశ్ కు చెందిన 'బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్' థరూర్ సైట్ పై దాడి చేసినట్టు తెలిసింది. ఇదేదో రాజకీయ కారణాలతో హ్యాకింగ్ చేశారనుకుంటే పొరబడ్డట్టే. వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ హ్యాకింగ్ జరగడం గమనార్హం. టీమిండియాతో క్వార్టర్ ఫైనల్ పోరు సందర్భంగా బంగ్లాదేశ్ ను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరిస్తూ హ్యాకర్లు థరూర్ వెబ్ సైట్లో సందేశాన్నుంచారు. 2007లో వరల్డ్ కప్ లో, 2012 ఆసియా కప్ లో ఏం జరిగిందో గుర్తుచేసుకోవాలని పేర్కొన్నారు. ఓవరాల్ రికార్డు భారత్ కు అనుకూలంగా ఉన్నా, వరల్డ్ కప్ రికార్డు బంగ్లాదేశ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. భారత మీడియా తమ జట్టును తక్కువ చేసి చూపుతోందని హ్యాకర్లు ఆరోపించారు. దీనిపై శశి థరూర్ స్పందిస్తూ, తన వెబ్ సైట్ ను హ్యాక్ చేశారని, టీమిండియాకు మద్దతిస్తున్నందుకు ఇది స్వల్ప మూల్యం అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News