: హైదరాబాద్ పేలుళ్ళ బాధితులకు బాలయ్య ఆర్ధిక సాయం
నందమూరి బాలకృష్ణ తన పెద్దమనసు చాటుకున్నాడు. నేడు చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇటీవల హైదరాబాద్ వరుస పేలుళ్ళ ఘటనలో గాయపడిన కొందరికి బాలయ్య ఆపన్న హస్తం అందించాడు. ఆ విషాద ఘటనలో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న శ్రావణి, బాలయ్య గౌడ్ లను ఈ నందమూరి హీరో ఈరోజు పరామర్శించడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు ఆటోలను అందజేశాడు. అంతేగాకుండా, ఓ అంధుల పాఠశాలలో చిన్నారుల మధ్య బాబు బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నాడు.