: భారత అధికారుల తీరు రుచి చూసిన సోలార్ ఇంపల్స్ 2 సిబ్బంది


ప్రపంచయాత్ర చేస్తున్న తొలి సోలార్ విమానం 'సోలార్ ఇంపల్స్ 2' నేటి సాయంత్రం వారణాసిలో దిగనుంది. గత వారం గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న సోలార్ ఇంపల్స్ 2 విమానానికి కస్టమ్స్ అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం బయల్దేరలేకపోయింది. మనదేశంలో అధికారుల అలసత్వాన్ని సోలార్ ఇంపల్స్ 2 సిబ్బంది స్వయంగా చవిచూశారు. దీంతో, అహ్మదాబాద్ నుంచి వారణాసికి ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. నేటి సాయంత్రానికి విమానం వారణాసి చేరనుంది. దీనిపై సోలార్ ఇంపల్స్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని పైలట్ బెర్ట్రాండ్ పికార్డ్ కు ఇండియాలో పాస్ పోర్టు సమస్య ఎదురైంది. ఎవరైనా సహాయం చేయగలరా? అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కాగా, ప్రపంచానికి సోలార్ పవర్ సామర్ధ్యం తెలియజెప్పేందుకు, వైమానిక రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సోలార్ ఇంపల్స్ 2 ను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇద్దరు పైలట్లు దీనిపై ప్రపంచయాత్రకు బయల్దేరారు.

  • Loading...

More Telugu News