: కోహ్లీకి ట్విట్టర్ లో అనుష్క రిప్లై... మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పిన ప్రేయసి


ప్రియురాలు అనుష్క శర్మ నటించిన 'ఎన్ హెచ్ 10' చిత్రాన్ని ఇటీవల చూసిన యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో తెగ మెచ్చేసుకున్నాడు. తన ప్రేయసి గురించి సామాజిక మాధ్యమంలో ప్రస్తావించడం కోహ్లీకి ఇదే మొదటిసారి. ఇందుకు ఉబ్బితబ్బిబ్బైన అమ్మడు కూడా బాయ్ ఫ్రెండ్ కోహ్లీకి ట్విట్టర్ లో సమాధానం ఇచ్చింది. "థాంక్యూ కోహ్లీ. చాలా ఆనందంగా ఉంది" అని అనుష్క ట్వీట్ చేసింది. తమ ప్రేమ వ్యవహారాన్ని చాలా ఆలస్యంగా బయటపెట్టిన ఈ లవ్ జంట సోషల్ మీడియాలో ఒకరి పట్ల మరొకరు స్పందించడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News