: ఈ రోజు రాజ్యసభ సమావేశాలకు హాజరైన నటి రేఖ
గతేడాది రాజ్యసభ సమావేశాలకు హాజరుకాకుండా విమర్శలెదుర్కొన్న నటి రేఖ ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సెషన్స్ కు తొలిసారిగా హాజరయ్యారు. లైట్ క్రీమ్ కలర్ చీర ధరించిన ఆమె రాజ్యసభలో ఈరోజు జీరో అవర్ లో వచ్చారు. తనకు కేటాయించిన 99వ నంబర్ సీటులో కూర్చున్న రేఖ తన పక్కన ఉన్న సోషల్ వర్కర్ అనూ ఆగా, ఎన్ కే గంగూలీలతో మాట్లాడడం కనిపించింది. దాదాపు పది నిమిషాల పాటు ఆమె సభలో ఉన్నారు. 2012లో రాజ్యసభకు ఎంపికైన రేఖ ఇప్పటివరకు పది పార్లమెంట్ సెషన్లకు హాజరయ్యారు.