: ఆప్ లో పెరిగిన విభేదాలు... పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తానన్న ప్రశాంత్ భూషణ్


ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు పెరిగిపోయాయి. పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తానని అసమ్మతి నేత, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లతో సమావేశమయ్యేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. ఈలోగా జాతీయ ఎగ్జిక్యూటివ్ పదవి సహా అన్ని పదవులకీ రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ కు భూషణ్ లేఖ రాశారు. అయితే, వచ్చేవారం బడ్జెట్ సమావేశాల వరకు తాను బిజీగా ఉంటానని కేజ్రీ చెప్పారని, ఆ తరువాత ఆయనను కలుస్తానని భూషణ్ చెప్పారు.

  • Loading...

More Telugu News