: ఇరు పక్షాలదీ ఒకటే డిమాండ్... వీడియో ఫుటేజీలను బయటపెట్టాలంటున్న టీడీపీ, వైసీపీ నేతలు
ఏపీ అసెంబ్లీలో జరిగిన దూషణల పర్వంపై అధికార, విపక్షాలు ఒక్క మాట మీదే నిలబడ్డాయి. దూషణల పర్వానికి తాము కారణం కాదంటే, తామూ కాదని మీడియా ముందు వాదనలు వినిపించిన ఇరు పార్టీల నేతలు, ఒకటే డిమాండ్ చేయడం విశేషం. సభలో జరగిన తంతుకు సంబంధించి వీడియో ఫుటేజీలు బయటపెట్టాలని... తద్వారా ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో తెలుస్తుందని అటు బోండా ఉమతో పాటు ఇటు రోజా కూడా అన్నారు. తమ సభ్యులను రెచ్చగొట్టేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని రోజా ఆరోపించగా, రన్నింగ్ కామెంట్రీలతో విపక్ష సభ్యులు సతాయిస్తున్నారని బోండా విమర్శించారు.