: డీకే, గొంగిడి మధ్య వాగ్యుద్ధం... తెలంగాణ సభలో మహిళా ఎమ్మెల్యేల బిగ్ ఫైట్!


తెలంగాణ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. అక్రమ మద్యం వ్యాపారిని అసెంబ్లీలోకి ఎలా తీసుకువస్తారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ... ప్రభుత్వ విప్ గొంగిడి సునీతను నిలదీశారు. దీనికి ఘాటుగా స్పందించిన గొంగిడి సునీత... మీపై హైకోర్టులో అక్రమ ఇసుక కేసు నడుస్తోందని ప్రత్యారోపణ చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మహిళా సభ్యుల మధ్య నెలకొన్న గొడవలో జోక్యం చేసుకున్న అబ్కారీ మంత్రి పద్మారావు, మద్యం వ్యాపారి ఎవరూ అసెంబ్లీ లాబీల్లోకి రాలేదని చెప్పారు. అవాస్తవాలతో ఆరోపణలు చేయడం సరికాదని ఆయన సూచించారు. దీంతో ఇద్దరు మహిళా సభ్యులు శాంతించారు.

  • Loading...

More Telugu News