: 'ఫితూర్' సెట్స్ లో కత్రినా కైఫ్ కు చిన్న గాయం
తన తదుపరి చిత్రం 'ఫితూర్' షూటింగ్ తో బిజీగా ఉన్న అందాల భామ కత్రినా కైఫ్ ఇటీవల సెట్స్ లో చిన్న ప్రమాదానికి గురైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశ సీక్వెన్స్ లో కత్రినా డ్రైవింగ్ చేయాల్సి ఉంది. అయితే ఆ సమయంలో అమ్మడు కారు డోర్ వేసుకోవడం మర్చిపోయింది. దాని ఫలితంగా డ్రైవింగ్ చేస్తుండగా కారు ఓ గోడకు గుద్దుకుంది. కానీ ఎలాంటి హాని జరగకుండా కేట్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. చాలా చిన్న గాయాలే అయ్యాయని తెలిసింది. రేఖ, ఆదిత్యా రాయ్ కపూర్, రాహుల్ భట్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.