: మంద కృష్ణ అరెస్ట్... లక్డీకాపూల్ లోని హోటల్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు


ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగను పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని డిమాండ్ చేస్తూ నేడు అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచే అసెంబ్లీ సమీపంలో వాహనాల రాకపోకలను నిషేధించిన పోలీసులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ సమీపంలోని ఓ హోటల్ వద్దకు చేరుకున్న మంద కృష్ణ అందులో బస చేశారు. అతని ఫోన్ పై కూడా నిఘా వేసిన పోలీసులు ఆయన ఆచూకీని మాత్రం కనుగొనలేకపోయారు. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్న మంద కృష్ణను ఎట్టకేలకు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News