: పవన్... మీరెప్పుడు ముఖ్యమంత్రి అవుతారు?: ప్రశ్నించిన నటుడు ఆర్.నారాయణమూర్తి


దర్శకుడు వైవీఎస్ చౌదరి రూపొందించిన 'రేయ్' చిత్రంలోని 'పవనిజం...' పాట విడుదల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అనూహ్యంగా స్పందించారు. "వాళ్లు ముఖ్యమంత్రి అవుతారు, వీళ్లు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం కాదు. మీరెప్పుడు సీఎం అవుతారో చెప్పండి" అని ప్రశ్నించారు. నటుడు చిరంజీవి 40 ఏళ్ల కంచుకోటను బద్దలుకొట్టి మెగాస్టార్ అయ్యారని, ఆయన నీడలో పవన్... పవర్ స్టార్ గా ఎదిగారని అన్నారు. ఆయనో మానవత్వం ఉన్న వ్యక్తని ప్రశంసించారు. ప్రజల సమస్యల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ పార్టీ పెట్టారు కాబట్టి సీఎం అవ్వాలని అభిలషించారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని లేదని, ఎందుకంటే తాను పార్టీ పెట్టలేదు కదా? అని చెప్పారు. అందుకే పవన్ తప్పకుండా సీఎం అవ్వాలని కోరుకుంటున్నానన్నారు. రొనాల్డ్ రీగన్, ఎన్టీఆర్, ఎమ్జీఆర్ లా రాజకీయాల్లోనూ పవన్ పేరు తెచ్చుకోవాలని నారాయణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News