: ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఏపీ అసెంబ్లీలో వాగ్యుద్ధం... జగన్, దేవినేనిల మధ్య మాటల యుద్ధం
ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఏసీ అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ఆల్మట్టి ఎత్తు పెంపునకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అలసత్వమే కారణమని దేవినేని ఆరోపించగా, జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్లే ఆల్మట్టి ఎత్తు పెరిగిందని జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సుప్రీం తీర్పు కాపీని చదివి వినిపించారు. అంతేకాక రాష్ట్రంలో గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతి వైఎస్ చలవేనని ఆయన పేర్కొన్నారు.