: విశాఖలో డ్రగ్స్ కలకలం... నిందితుల్లో బడాబాబుల పిల్లలు?


ఏపీ వాణిజ్య రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖలో నేటి ఉదయం డ్రగ్స్ కలకలం రేగింది. నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో బడాబాబుల పుత్రరత్నాలు ఉన్నారని విశ్వసనీయ సమాచారం. బడాబాబుల పిల్లలున్నందుననే అరెస్ట్ సమాచారాన్ని మీడియాకు అందించిన పోలీసులు నిందితులను మాత్రం మీడియాకు చూపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరెస్టైన నిందితుల వద్ద నుంచి పోలీసులు 1,100 పోర్ట్ విన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News