: తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పేర్వారం రాములు... కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ


తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొద్దిసేపటి క్రితం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదాను కల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండగా, డీజీపీగా పనిచేసిన పేర్వారం రాములు, ఆ తర్వాత ఏపీపీఎస్పీ చైర్మన్ గానూ కొంతకాలం పనిచేశారు.

  • Loading...

More Telugu News