: అసెంబ్లీలో బయటి వ్యక్తులతో ఫొటో దిగిన రోజా.... సభా హక్కుల ఉల్లంఘన నోటీసు


టాలీవుడ్ అగ్రనటిగా కొనసాగి ఆ తర్వాత రాజకీయవేత్తగా మారిన రోజా, తన మునుపటి డాబు దర్పాన్ని ఏమాత్రం వీడలేదు. ఇప్పటికీ బుల్లితెరపై రెగ్యులర్ గా, వెండితెరపై అడపా దడపా సందడి చేస్తున్న ఆమె... నిన్న అసెంబ్లీలోనూ సందడి చేశారు. నిన్నటి సమావేశాలు ముగిసిన అనంతరం బయటి వ్యక్తులతో కలిసి సభలో ఫొటోలు దిగారు. విషయం తెలుసుకున్న అధికార పక్షం వైసీసీ ఎమ్మెల్యేగా ఉన్న రోజాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నేటి సమావేశాల్లో భాగంగా రోజాపై చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ప్రతిపాదించారు.

  • Loading...

More Telugu News