: నా గర్ల్ ఫ్రెండ్ నటన సూపర్!: ట్విట్టర్ లో టీమిండియా వైస్ కెప్టెన్ కోహ్లీ
భార్యలు, ప్రియురాళ్లను కలవడంతో పాటు వారితో కలిసి గడిపేందుకు టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ అనుమతిచ్చిన మరుక్షణమే జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ నటించిన బాలీవుడ్ తాజా మూవీ ఎన్ హెచ్ 10ను చూసేశాడు. అంతేకాదు, ఆ సినిమాలో అనుష్క నటన సూపరంటూ కితాబు కూడా ఇచ్చేశాడు. ఈ మేరకు అతడు ట్విట్టర్ లో కామెంట్లు చేశాడు. నిన్న సినిమా చూసిన తర్వాత ‘‘ఇప్పుడే ఎన్ హెచ్ 10 చూశా. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా నా గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ అద్భుతం. చాలా గర్వంగా ఉంది’’ అంటూ ట్విట్టర్ లో కోహ్లీ పేర్కొన్నాడు.