: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మృతి


నల్లగొండ జిల్లాలో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని మఠంపల్లి మండలం అవరేనికుంట వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరణించినవారితో పాటు క్షతగాత్రులంతా మఠంపల్లి మండలం కాల్వపల్లికి చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News