: కేసీఆర్... పాప్యులర్ చాయిస్ ఇండియన్ ఆప్ ది ఇయర్: తెలంగాణ సీఎంకు సీఎన్ఎన్-ఐబీఎన్ అవార్డు


ఉద్యమ నేతగానే కాక, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అరుదైన ఘనతను సాధించారు. పదేళ్లకు పైగా ఉద్యమానికి జవజీవాలు నింపడంతో పాటు కొత్త రాష్ట్రం పాలనాపగ్గాలు చేపట్టిన ఆయన రాజకీయ చతురతను దేశం గుర్తించించింది. 2014 ఏడాదికి సంబందించి ‘పాప్యులర్ చాయిస్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ గా ఎంపికయ్యారు. ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్-ఐబీఎన్, కేసీఆర్ కు ఈ అవార్డును ప్రకటించింది. ఏటా ఇస్తున్న అవార్డుల్లో భాగంగా గతేడాది అవార్డుల కోసం సదరు చానెల్ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఇందులో ఇంటర్నెట్ లో నెటిజన్ల నుంచి కేసీఆర్ కు మద్దతు వెల్లువెత్తింది. దీంతో ఆయన పాప్యులర్ చాయిస్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి కేసీఆర్ తరఫున టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అవార్డును స్వీకరించారు.

  • Loading...

More Telugu News