: ఎమ్మార్పీఎస్, నిరుద్యోగ జేఏసీ అసెంబ్లీ ముట్టడి... దారులన్నీ మూసేసిన పోలీసులు


ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఆది నుంచి వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర విభజన తర్వాత సడెన్ గా తన వైఖరి మార్చుకున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్, వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసినా, అమలు చేసే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. ఈ రెండు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్, నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ముట్టడిలో పాల్గొనేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హైదరాబాదు చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ ప్రకటనల జారీ కోసం రోడ్డెక్కిన నిరుద్యోగ జేఏసీ కూడా నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆందోళనకారులు అసెంబ్లీ వైపు దూసుకురాకుండా అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిధిలోని 2 కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలను నిషేధించారు. భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించారు.

  • Loading...

More Telugu News