: వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్స్ పోరు... మరికాసేపట్లో లంక, సఫారీల మధ్య మ్యాచ్
రికార్డులు బద్దలవుతున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో నేటి నుంచి క్వార్టర్ ఫైనల్స్ పోరు మొదలు కానుంది. శ్రీలంక, దక్షిణాఫ్రికాల మధ్య మరికాసేపట్లో తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నేటి ఉదయం 9 గంటలకు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జోరు మీదున్న ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది. ఇరు జట్లలోని స్టార్ ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్న నేపథ్యంలో భారీ స్కోర్లు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటిదాకా వరల్డ్ కప్ టైటిల్ దక్కని సౌతాఫ్రికా... ఈ సారి సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోసారి దేశానికి టైటిల్ తీసుకెళ్లాలని లంక తాపత్రయపడుతోంది. నేటి మ్యాచ్ లో విజయం సాధించే జట్టు సెమీ ఫైనల్స్ కు వెళ్లనుండగా, ఓటమి పాలయ్యే జట్టు నేరుగా ఇంటికెళ్లాల్సి ఉంటుంది.