: కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన టి.ఎఫ్.సి.సి... తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు


తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టి.ఎఫ్.సి.సి) నూతన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సీఎంను కలుస్తామని, చిన్న సినిమాలకు రాయితీలు, సినిమాలకు వినోద పన్ను రాయితీ కల్పించాలని కోరతామని వారు తెలిపారు. కాగా, టి.ఎఫ్.సి.సి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా విజయేందర్ రెడ్డి, ఆర్ట్ సినిమాల దర్శకుడు బి.నర్సింగరావు ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. బాలగోవిందరావు, అల్లాణి శ్రీధర్, సంగిశెట్టి దశరథ, సత్యనారాయణ గౌడ్ వర్కింగ్ కమిటీ సభ్యులు.

  • Loading...

More Telugu News