: శరద్ యాదవ్ క్షమాపణ చెప్పాల్సిందే: హేమామాలిని
దక్షిణాది మహిళలు నల్లగా ఉన్నా అందంగా ఉంటారని, ఉత్తరాది మహిళలు అలా ఉండరని పార్లమెంటులో శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ ఎంపీ హేమమాలిని డిమాండ్ చేశారు. సీనియర్ నేత అయిన శరద్ యాదవ్ మహిళల పట్ల అమర్యాదపూర్వకంగా మాట్లాడడం క్షమించరాని అంశమని, దీనిపై ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. కాగా, దీనిపై క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని శరద్ యాదవ్ కుమార్తె తన తండ్రికి మద్దతుగా నిలిచారు.