: కొత్త నివాసంలో ఏసీలు వద్దంటున్న 'సామాన్యుడు'


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సామాన్య జీవితాన్నే ఇష్టపడతారు. తాను సాధారణ వ్యక్తినే అని చాటుకునే క్రమంలో, కొత్త నివాసంలో అన్ని ఏసీలు తొలగించాలని స్పష్టం చేశారు. కేజ్రీ మరికొన్ని రోజుల్లో సివిల్ లైన్స్ ఏరియాలోని నెంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ లోని నూతన భవనంలోకి షిఫ్టవుతున్నారు. ఈ నేపథ్యంలో, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కు తన నిర్ణయం తెలిపారు. అయితే, ఆ నాలుగు బెడ్ రూంల భవనానికి ఏసీలు తీసివేస్తే ఆ స్థానంలో పెద్ద ఖాళీలు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు. ఆ ఖాళీల స్థానంలో కిటికీలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. కేజ్రీ కొత్త నివాసం రెండు లాన్లు, రెండు సర్వెంట్ క్వార్టర్లు కలిగి ఉంది.

  • Loading...

More Telugu News