: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలపై పార్లమెంటులో వాడీవేడి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, విభజన బిల్లులో పేర్కొన్న హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. బిల్లులో పేర్కొన్న అన్ని అంశాలను ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని, తాము పదేళ్లు సంయమనం పాటించామని ఆయన సూచించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరిగిన చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు.

  • Loading...

More Telugu News