: మా వరకు ఇది మరో మ్యాచ్ అంతే: షకిబ్ అల్ హసన్


వరల్డ్ కప్ లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్న రెండో నాకౌట్ మ్యాచ్ ను మరోపెద్ద మ్యాచ్ గా క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు పేర్కోవడంపై బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ స్పందించాడు. తమ వరకు అన్ని పోటీల్లాగే ఇదీ ఒక మ్యాచ్ అని, అంతకన్నా దీనికి ప్రాధాన్యత కల్పించడం లేదని అన్నాడు. "ఈ మ్యాచ్ ను అంతా హోరాహోరీ పోరుగా అభివర్ణించవచ్చు, కెరీర్ లో కూడా ఇది అతిపెద్ద మ్యాచ్ కావచ్చు. ఎందుకంటే మేం తొలిసారి వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాం" అని అన్నాడు. అయితే, దీనిపై ఎలాంటి ప్రత్యేక భావం లేదని, అన్ని మ్యాచ్ ల లాగే ఇదీ ఒక మ్యాచ్ మాత్రమే అని షకిబ్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News