: జానారెడ్డి మెదడుకు పక్షవాతం వచ్చిందన్న టీఆర్ఎస్ నేత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ధ్వజమెత్తారు. మంత్రి జగదీష్ రెడ్డిని చెల్లని రూపాయిగా అభివర్ణించిన జానారెడ్డే చెల్లని రూపాయి అంటూ కిశోర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందనే భయంతోనే జానారెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. జానా మెదడుకు పక్షవాతం వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లోనే జానా అవినీతిని బయటపెడతామని, ప్రస్తుతం జానాకు కూడా ఇదే భయం పట్టుకుందని అన్నారు. జానా కాళ్ల కింద భూమి కదులుతోందని చెప్పారు.