: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా సోనియా నేతృత్వంలో ర్యాలీ


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ఢిల్లీలో ర్యాలీ ప్రారంభమైంది. పలు విపక్షాలు పాల్గొన్న ఈ నిరసన మార్చ్ పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు జరగనుంది. రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నాక బిల్లుపై వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సోనియా అందజేయనున్నారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న బిల్లును ఆపివేయాలని రాష్ట్రపతిని కోరనున్నారు. కాంగ్రెస్ నేతలు, ఎంపీలు, ఇతర పార్టీ ఎంపీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ నేపథ్యంలో రాజధానిలో పలుచోట్ల భద్రతా చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News