: ఆంధ్రప్రదేశ్ కు ఉత్తరాఖండ్ లా ప్రత్యేక హోదా ఇవ్వండి: మిథున్ రెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాఖండ్ లా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. "మా రాష్ట్రానికి రాజధాని లేదు. పోలవరం పూర్తి కాలేదు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పరిష్కరించలేదు. జల, విద్యుత్ సమస్యలు రాజుకుంటున్నాయి" అని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములమనే భావనతో బ్రతికే పరిస్థితులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News