: సైనా నెహ్వాల్, కశ్యప్ లకు బీఐఏ నజరానా


సైనా నెహ్వాల్, కామన్ వెల్త్ గేమ్స్ ఛాంపియన్ పారుపల్లి కశ్యప్ లకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఐఏ) అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా నగదు పురస్కారం ప్రకటించారు. ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ఢిల్లీలో తెలిపారు. అంతర్జాతీయ వేదికపై ఆకట్టుకునే ప్రదర్శన కనబరచినందుకుగానూ నజరానా ప్రకటించినట్టు చెప్పారు. "అంతర్జాతీయ సర్క్యూట్ లో అనూహ్య ప్రదర్శన కనబర్చిన, తమ టైటిల్ విజయంతో దేశానికి గర్వకారణమైన ఆటగాళ్లకు నజరానా ఇవ్వడం నా విధానం. సైనా, కశ్యప్ లు ఇద్దరూ సయ్యద్ మోదీ జీపీ ఈవెంట్ లో బంగారు పతకాలు గెలిచారు. దాంతో ప్రపంచ నంబర్ 2 ర్యాంకులో సైనా నిలిచింది" అని దాస్ గుప్తా పేర్కొన్నారు. జనవరిలో లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ టోర్నీలో సైనా, కశ్యప్ మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. అంతేగాక, ఈ నెల మొదట్లో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ లో ఫైనల్స్ కు చేరిన తొలి భారత మహిళా షట్లర్ గా సైనా చరిత్రకెక్కింది.

  • Loading...

More Telugu News