: అందుకే కాస్త ఘాటుగా స్పందించా: చంద్రబాబు
_3192.jpg)
ప్రతి విషయాన్నీ విపక్షాలు రాజకీయం చేయాలని భావిస్తున్నాయని, తాను మౌనంగా ఉంటే బలహీనతగా భావించే ప్రమాదముందని, అందువల్లే నేటి సభలో కాస్తంత ఘాటుగా స్పందించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అసెంబ్లీ వాయిదాపడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టు జగన్ కు ఇచ్చేందుకు సిద్ధమని, అధిక రేటుకు కాంట్రాక్టు ఇస్తున్నారని విమర్శించిన జగన్, ప్రస్తుత రేట్లతో ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమేనా? అని బాబు ప్రశ్నించారు. పోలవరం పూర్తవడానికి మరో నాలుగేళ్లు పడుతుందని, ఈలోగా రాయలసీమకు నీరు అందిస్తామంటే, జగన్ కు బాధ ఎందుకని ఆయన విమర్శించారు. తన రాజకీయ అనుభవమంత వయసు లేని జగన్ కు కొన్ని విషయాల్లో సమాధానం చెప్పే అవసరం లేకపోయినా స్పందిస్తున్నానని అన్నారు. తాను 'మీరు' అని సంభోదిస్తుంటే, జగన్ ఏకవచనంతో మాట్లాడుతున్నారని అన్నారు.