: వైఎస్ఆర్ ను, నన్ను తిట్టించడమే బాబు లక్ష్యం... మీడియాతో జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, తనను తెలుగుదేశం మంత్రులు, ఎంఎల్ఏలతో తిట్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి లక్ష్యంగా కనిపిస్తోందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. నేటి మధ్యాహ్నం అసెంబ్లీ వాయిదా పడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో అధికార పక్ష వైఖరిని జగన్ ఖండించారు. అసెంబ్లీలో చర్చ జరిగితే బాబు అవినీతి బాగోతాలు బయటపడతాయనే, కీలక అంశాలపై చర్చను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాల్వ శ్రీనివాసులు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు తిట్టే పనిమీద ఉంటారని విమర్శించారు.