: ఏపీకి ప్రత్యేక హోదాపై నా మాటలను మీడియా వక్రీకరించింది: మొయిలీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాట మార్చారు. ప్రత్యేక హోదాపై తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. కొన్ని మాటలను తీసుకుని తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది సరైన పధ్ధతి కాదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని, దాంతోపాటు ప్యాకేజీ కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసేలా తానేమీ మాట్లాడలేదన్నారు. ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులను తాను స్వాగతిస్తున్నానని ఢిల్లీలో మొయిలీ మీడియాతో చెప్పారు.