: సాకర్ ఆడిన టీమిండియా... బంగ్లా జట్టును తేలిగ్గా తీసుకుంటున్నారా?


బంగ్లాదేశ్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నాకౌట్ పోరు కావడంతో టీమిండియా ఎంత శ్రమిస్తుందో అనుకునేరు! అలాంటిదేమీ జరగలేదు. మంగళవారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కు చేరుకున్న ఆటగాళ్లు నెట్స్ లో సాధన చేసేందుకు బదులు ఎంచక్కా సాకర్ ఆడి రిలాక్సయ్యారు. మనవాళ్ల నెట్ ప్రాక్టీస్ సెషన్ ను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా బృందం సాకర్ గేమ్ చూసి వెనుదిరిగింది. మీడియాతో మాట్లాడేందుకు ధోనీ సేన విముఖత కనబర్చింది. కాగా, భారత్-బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ పై మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ తన వ్యాసంలో స్పందించారు. వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టు బంగ్లాదేశ్ తో తలపడిన ప్రతి సందర్భం తనకు గుర్తేనని, అందరూ 2007 నాటి ఫలితాన్ని ప్రస్తావిస్తున్నారని శ్రీనాథ్ పేర్కొన్నాడు. అప్పుడు కరీబియన్ గడ్డపై జరిగిన మెగా ఈవెంట్లో బంగ్లా జట్టు మనవాళ్లకు షాకివ్వడం తెలిసిందే. ఆ టోర్నీ ఆరంభం నుంచే జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని, అదే బంగ్లాదేశ్ తో పోరులోనూ ప్రతిఫలించిందని శ్రీనాథ్ తెలిపాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టు అత్యుత్తమ ఆటతీరు కనబర్చినా, గెలవడం ఎలాగో తెలిసిన టీమిండియా ముందు అది సరిపోదని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News