: ఏడు మండలాల విద్యుత్ శాఖ బాధ్యతలు ఏపీకి అప్పగింత


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వరుసగా ఒక్కొక్క సమస్య తొలగిపోతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీలో విలీనమైన ఏడు మండలాల విద్యుత్ శాఖ బాధ్యతలను ఏపీ ప్రభుత్వానికి బదలాయించారు. ఈ మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను కూడా ఇచ్చారు. 5 సబ్ స్టేషన్లు, 33 వేల విద్యుత్ కనెక్షన్లు, 880 ట్రాన్స్ ఫార్మర్లను ఏపీకి ఇచ్చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ మండలాల్లో విద్యుత్ ను ఏపీ ట్రాన్స్ కో నియంత్రిస్తుంది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో కొన్ని గ్రామాలు, వీరులపాడు, కుకునూరు, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను ఏపీలో కలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News