: బీహార్ జైలులో అసభ్య నృత్యాలు... విచారణకు ఆదేశం
బీహార్ లోని చాప్రా జైలులో 'ఖైదీల కోసం వినోదం' పేరిట నిబంధనలను తుంగలో తొక్కి ఏర్పాటు చేసిన కార్యక్రమం వివాదాస్పదం అయింది. 'స్ప్రింగ్ సీజన్ మ్యూజిక్ ప్రోగ్రామ్' పేరిట కొందరు ఖైదీలు డాన్సు ప్రోగ్రామ్ పెట్టి నృత్యాలు చేసేందుకు హిజ్రాలను పిలిపించారు. వారితో కలసి చిందులు వేయగా, ఆ దృశ్యాలు బహిర్గతం అయ్యాయి. ఈ ఘటన ఆదివారం నాడు జరుగగా, సారన్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ ఆనంద్ విచారణకు ఆదేశించారు. జైలు పరిధిలో అసభ్య నృత్యాలకు అనుమతించిన అధికారులపై విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. కాగా, విచారణ మొదలుపెట్టిన పోలీసులు ఆ ప్రాంతంలోని హిజ్రాలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.