: దిగంబరంగా నిద్రిస్తే ఎన్నో లాభాలట... స్లీప్ ఫౌండేషన్ అధ్యయనం


రాత్రిపూట నిద్రించే ముందు మీ నైట్ డ్రస్సులు తీసి పక్కన పెట్టండి. శరీరానికి మరింత గాలి రానివ్వండి. దీనివల్ల అపరిమితమైన ఆరోగ్య లాభాలను పొందవచ్చని అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తాజాగా వెలువరించిన అధ్యయనం వెల్లడించింది. అధ్యయనం ముఖ్యాంశాలు... * నగ్నంగా పడుకొని నిద్ర పోవడం వల్ల అదనపు వేడి తగ్గి మరింత గాఢమైన నిద్రలోకి పోతారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మరింత సుఖమైన నిద్ర పడుతుంది. * మంచి నిద్ర ఒత్తిడిని దూరం చేస్తుంది. అధిక బరువు పెరిగేందుకు గల కారణాలలో ఒత్తిడి కూడా ఒకటి. * సుఖనిద్రలో గ్రోత్ హార్మోనుల ఉత్పత్తి పెరిగి స్ట్రెస్ హార్మోనుల ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా స్థూలకాయానికి దూరం కావచ్చు. శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. * గ్రోత్ హార్మోనుల వృద్ధి వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గాఢ నిద్ర కారణంగా రక్త కణాలు మరింత శక్తిని పొందుతాయి. * దిగంబర నిద్రతో పురుషులలో వీర్య కణాల వృద్ధి, లైంగిక సామర్థ్యం పెరుగుతాయి. మహిళల్లో యోనిని తాకే బ్యాక్టీరియాలు దూరం అవుతాయి. జీవిత భాగస్వామితో కలసి నిద్రిస్తే, ఇద్దరి మధ్యా 'ప్రేమ' హార్మోనులు పెరిగి, భౌతిక, మానసిక బంధం దృఢపడుతుంది. ఇది పగటిపూట అనుబంధాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. దీంతోపాటు ఇరువురి శరీరాల్లో ఆక్సీటోసిన్ పెరిగి బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. నగ్నంగా నిద్రించడం వల్ల మంచి కొవ్వుగా పేరున్న 'బ్రౌన్ ఫ్యాట్' మరింత యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల బరువు పెంచే చెడు కొవ్వు కరుగుతుంది. ఇంకేం, దిగంబరంగా నిద్రించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూశారుగా... మీరూ ట్రై చేయండి.

  • Loading...

More Telugu News