: బాలీవుడ్ నటుడు గోవిందా పేరుతో ఘరానా మోసం


బాలీవుడ్ నటుడు గోవిందా పేరుతో ఘరానా మోసం జరిగింది. 'ఇండియన్ మోడల్ హంట్ స్టేజ్ షో' పేరిట గోవిందా పేరు చెప్పి కొందరు వ్యక్తులు రూ.6 కోట్లు వసూలు చేసి, ఆపై కుచ్చు టోపీ పెట్టారు. దాంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు మోసపోయారు. మద్దుల శ్రీనివాస్, పేరాల శ్రీనివాస్, రామారావు అనే వ్యక్తులు తమను మోసగించారంటూ బాధితులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హెచ్ఆర్సీ, జూన్ 1లోగా ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఖమ్మం ఎస్పీ, విజయవాడ కమిషనర్ ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News