: ఢిల్లీలో రాష్ట్రపతిని కలసిన టీ.టీడీపీ నేతలు
ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ముగిసేంతవరకు తమపై ప్రభుత్వం సస్పెన్షన్ విధించడంపై రాష్ట్రపతిని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించనున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, సభ నుంచి తమను సస్పెండ్ చేసిన విషయాలపై రాష్ట్రపతికి టీడీపీ నేతలు వివరిస్తారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి పలువురు తెలుగుదేశం నేతలు రాష్ట్రపతిని కలసిన వారిలో ఉన్నారు. ముందుగా 12.15కు ఎన్నికల కమిషన్ ను కలసి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.