: సచిన్ సరసన నిలిచేందుకు సంగక్కరకు ఇంకొక్కటి చాలు
ఈ వరల్డ్ కప్ లో అద్భుత పామ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ఎవరని ఎవర్నడిగినా... సంగక్కర అని ఠక్కున సమాధానమిస్తారు. ఎందుకంటే, వరుసగా నాలుగు మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు చేసి... ప్రపంచకప్ లోనే కాదు, ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టించాడు సంగక్కర. ఇప్పుడు అందరి కళ్లూ సంగక్కర పైనే ఉన్నాయి. ఎందుకంటే, మరో సెంచరీ చేస్తే చాలు... లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సరసన సంగక్కర నిలుస్తాడు. వరల్డ్ కప్ హిస్టరీలో ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతానికి సచిన్ పేరిట ఉంది. ఇప్పటి వరకు సచిన్ 6 సెంచరీలు చేసి ప్రథమ స్థానంలో నిలవగా... రికీ పాంటింగ్, సంగక్కర 5 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఏబీ డీవిలియర్స్, దిల్షాన్, జయవర్ధనేలు 4 సెంచరీలు చేశారు.