: తీవ్ర ఆందోళనల మధ్య ఏపీ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా
పట్టిసీమ ప్రాజెక్టు అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. దానిపై చర్చ చేపట్టాక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారంటూ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు. సభకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దాంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల ప్రకటించారు.