: పట్టిసీమ ప్రాజెక్టుతో కేసీఆర్ కు సంబంధం లేదు... ఆయనకు జగన్ మద్దతు తెలుపుతున్నారు: చంద్రబాబు


రాష్ట్రంలో చేపట్టనున్న పట్టిసీమ ప్రాజెక్టుతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు సంబంధం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకోవాలంటే తన అనుమతి తీసుకోవాలని కేసీఆర్ మాట్లాడుతున్నారని శాసనసభలో సీఎం చెప్పారు. కానీ తెలంగాణలో చేపట్టే ప్రాజెక్టులకు తామెలాంటి అడ్డుచెప్పలేదని, అలాంటప్పుడు ఏపీ ప్రాజెక్టుకు వారెలా అడ్డుపడతారన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కు మద్దతుగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు రావొద్దని జగన్ కోరుకుంటున్నారని, అందుకే ఇప్పుడిలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వాళ్ల సాక్షి పేపర్ లో కూడా 'పోలవరానికి చంద్రగ్రహణం' అంటూ రాశారనీ, ఆ పేపర్ కటింగ్ చూపిన బాబు, ఇది అవాస్తవమన్నారు. ఈ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం, తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఢిల్లీలో కూడా దానిపై సమావేశం జరిగిందన్నారు. కాబట్టి ఇటువంటి అవాస్తవ ప్రచారం ముందు ప్రతిపక్ష నేత జగన్ సభకు సమాధానం చెప్పి మాట్లాడాలని బాబు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News