: అవినీతి పత్రిక ఉందని అడ్డగోలుగా రాస్తారా?: జగన్ పై చంద్రబాబు నిప్పులు
పట్టిసీమపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ వాడీవేడిగా జరుగుతోంది. సాక్షి దినపత్రికలో 'పోలవరానికి చంద్ర గ్రహణం' పేరిట వచ్చిన వార్త కాపీని చంద్రబాబు సభలో చూపుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఈ కథనంపై క్షమాపణ చెప్పి, అందులో నిజానిజాలు వివరించిన తరువాతనే ఆయన మాట్లాడాలని డిమాండ్ చేశారు. అవినీతి పత్రిక ఉందని అడ్డగోలుగా రాస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై జగన్ స్పందిస్తూ, బాబు ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వందలకొద్దీ కథనాలు రాశాయని గుర్తు చేశారు. పత్రికలు చేసే పని పత్రికలు చేస్తాయి. మనం చేసే పని మనం చేద్దామని అన్నారు. ఆయన క్షమాపణ చెప్పేవరకూ మాట్లాడనివ్వమని మంత్రి అచ్చెనాయుడు తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.