: ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో పిల్
ఏపీ రాజధాని తుళ్లూరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పచ్చటి పొలాల భూములను రాజధాని భూసేకరణ కింద తీసుకోవడం మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని విజయవాడ నివాసి శ్రీమన్నారాయణ పిల్ లో పేర్కొన్నారు. కృష్ణాతీరంలో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని అందులో తెలిపారు. వరదలు వచ్చే ప్రాంతంలో రాజధాని సరికాదని చెప్పారు. ఈ పిల్ పై కోర్టు ఈ నెల 20న విచారణ చేపట్టే అవకాశం ఉంది.