: జాట్ల రిజర్వేషన్ ను తిరస్కరించిన సుప్రీం


జాట్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కులం అనేది ఆ కమ్యూనిటీ వెనుకబాటుతనాన్ని నిర్ణయించే ఏకైక ఆధారంగా ఉండకూడదంటూ కోర్టు తీర్పునిచ్చింది. రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించే ఓబీసీ జాబితాలో జాట్ లను కలపడం చాలా తప్పని కోర్టు బెంచ్ పేర్కొంది. బ్యాక్ వర్డ్ క్లాస్ కేటగిరీ కింద తొమ్మిది రాష్ట్రాల్లోని జాట్ కమ్యూనిటీకి రిజర్వేషన్ ను విస్తరించేందుకు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. రాజకీయ వ్యవస్థీకృత తరగతిగా ఉన్న జాట్ కమ్యూనిటీకి రిజర్వేషన్లపై స్టే ఇస్తున్నట్టు సుప్రీం పేర్కొంది.

  • Loading...

More Telugu News