: ఏడాదిలోపు చేసి చూపండి... పట్టిసీమపై ప్రభుత్వానికి వైకాపా సవాల్... సమాధానం ఇచ్చేందుకు మంత్రుల ఇబ్బంది!


ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా అధికార తెలుగుదేశం మంత్రులు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. చర్చ సందర్భంగా దేశం సభ్యులు మాట్లాడుతూ, పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళిస్తామని అనగా, వైకాపా సభ్యుడు విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, పట్టిసీమ ప్రాజెక్టు ఏడాదిలోపు పూర్తి కావడం అసంభవమని అన్నారు. ఒక్క సంవత్సరంలో ప్రాజెక్టులు పూర్తయితే... మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని ఎకరాలకు నీరిచ్చారని విరుచుకుపడ్డారు. పట్టిసీమను ఏడాదిలోపు పూర్తి చేసి సీమకు నిళ్లిస్తే జీవితంలో సభలో అడుగుపెట్టనని సవాల్ విసిరారు. తన సవాల్ ను ముఖ్యమంత్రి లేదా మంత్రులు స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ చీఫ్‌ విప్ కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ, రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేయడం తగదని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలన్నదే తమ అభిమతమని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరును ప్రస్తావిస్తూ, చర్చను పక్కదారికి పట్టించారు.

  • Loading...

More Telugu News