: పోలీసుల కన్నుగప్పి ఇందిరా పార్క్ చేరిన అంగన్ వాడీ కార్యకర్తలు... అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టులు చేసినా, పోలీసుల కన్నుగప్పి అంగన్ వాడీ కార్యకర్తలు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటల సమయంలో వందల సంఖ్యలో అంగన్ వాడీ కార్యకర్తలు ట్యాంక్ బండ్ సమీపంలోని ఇందిరా పార్కు వద్దకు చేరుకొని 'చలో అసెంబ్లీ' అంటూ అసెంబ్లీని ముట్టడించేందుకు బయలుదేరారు. తమ వేతనాలను పెంచాలన్న డిమాండ్ తో వారు నిరసన తెలుపగా, వారిని అసెంబ్లీ వైపు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, పెనుగులాట జరిగాయి. అంగన్ వాడీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.