: ఇద్దరు రాజకీయ ఉద్ధండుల మనసులనూ దోచుకున్న టీడీపీ అభ్యర్థి
ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ ఎంపిక చేసిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన తిప్పేస్వామి కూడా ఒకరు. గతంలో ఈయన వైయస్ విధేయుడిగా ఉండేవారు. దీంతో, వైయస్ ఆశీస్సులతో 2007లో మొదటిసారి ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం 2009లో కూడా వైయస్ ఈయనను మరోసారి ఎమ్మెల్సీ చేశారు. తదనంతరం చోటుచేసుకున్న ఘటనలతో, 2014లో తిప్పేస్వామి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉన్న తిప్పేస్వామిని చంద్రబాబు గుర్తించారు. దీంతో, ఆయన పంట పండింది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిప్పేస్వామికి అవకాశం ఇచ్చారు. ఈ రకంగా తెలుగు రాజకీయ రంగంలో ఉద్ధండులైన ఇద్దరు నేతల మనసులనూ తిప్పేస్వామి గెలుచుకున్నట్టైంది.