: ఆలస్యంగా వచ్చిన సిబ్బందిని మోకాలిపై నడిపించిన ఐజీ... అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేసిన పోలీసులు
పోలీసుల సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పుకునే ఓ ఐజీ తన సిబ్బందిపై క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఆర్డర్లీ డ్యూటీలు చేసే ఉద్యోగులపై తన 'పవర్' చూపారు. తన ఇంట్లో పనిచేసే ఆర్డర్లీలు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని ఒక మహిళ, ఇతర సిబ్బందిని ఆయన మోకాళ్లపై నడిపించారు. ఏదో ఐదో, పదో నిమిషాలు కాదు, ఏకంగా గంట పాటు నడిపించడంతో వారి మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో గన్‌మెన్లు, డ్రైవర్లు సదరు ఐజీ తమకొద్దు మొర్రో అంటూ, డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. త్వరలోనే సంబంధిత ఐజీని పిలిచి హెచ్చరిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్టు సమాచారం.