: అనంతలో ఆటో బోల్తా... ఏడుగురు విద్యార్థులకు గాయాలు, నలుగురి పరిస్థితి విషమం


రోడ్ టెర్రర్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అనంతపురం జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతున్న ఓ ఆటో బోల్తా పడింది. జిల్లాలోని ఉరవకొండ మోడల్ స్కూల్ సమీపంలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమీప గ్రామాల్లోని విద్యార్థులను మోడల్ స్కూల్ కు చేరవేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News