: అన్యమత ప్రచారంపై ‘సమితి’ ఆందోళన, అడ్డుకున్న పోలీసులు... తిరుపతిలో ఉద్రిక్తత
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో తరచూ చోటుచేసుకుంటున్న అన్యమత ప్రచారంపై హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలో నిషేధాజ్ఞలు ఉన్నా తరచూ సాగుతున్న అన్యమత ప్రచారంపై సమితి నేడు తిరుపతిలోని టీటీడీ కార్యాలయం ముట్డడికి సిద్ధమైంది. పెద్ద సంఖ్యలో పోగైన సమితి నేతలు, కార్యకర్తలు టీటీడీ కార్యాలయం వద్దకు వెళుతుండగా వారిని నగరంలోని శ్రీనివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకున్న పోలీసులను సమితి కార్యకర్తలు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు, సమితి కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి అక్కడకు చేరుకుని పరిస్థితి చేయి దాటిపోకుండా చర్యలు చేపట్టారు.